పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లిలో విషాదం జరిగింది. గోదావరి నదిలోకి దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. సమీప గ్రామమైన వల్లూరుకు చెందిన ఆరుగురు యువకులు సాయంత్రం నదిలోకి స్నానానికి దిగారు. ఈ క్రమంలో ఎల్లమెల్లి మనోజ్‌కుమార్ అనే 20 ఏళ్ల యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎస్ఐ సీహెచ్ రాజశేఖర్, తహసీల్దార్ ఆర్వీ కృష్ణారావు స్థానిక మత్స్యకారులతో గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మనోజ్ నర్సాపురం వైఎం డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఇదీ చూడండి..