పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన వివాహిత... అత్తారింటి ముందు సోమవారం నిరసన చేపట్టింది. ప్రేమ పేరుతో వివాహం చేసుకున్న భర్త... వదిలి వేశాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన ఆమెకు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన మరో యువకుడు తనను సంప్రదించాడని.. చెప్పింది. "నిన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మంచి వాడు కాదు. అతనికి చెడు అలవాట్లు ఉన్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటే నీకు బంగారం లాంటి భవిష్యత్తును ఇస్తా" అని మాయమాటలు చెప్పి తనను పెళ్లి చేసుకున్నట్లు మహిళ ఆరోపించింది.
ఈ జంట ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉన్నారు. భర్త వదిలేసిన తర్వాత.. తాను అన్నివిధాలా నష్టపోయానని ఆ మహిళ ఆవేదన చెందింది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం వాళ్ల గురించి చెడుగా చెప్పి.. తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలేయడం దారుణం అంటూ ఆ మహిళా కన్నీటిపర్యంతమవుతోంది. న్యాయం జరిగే వరకు తన అత్తారింటి ముందు నుంచి వెళ్లే ప్రసక్తే లేదని ఆ మహిళ భీష్మించుకుని అక్కడే కూర్చుంది.
ఈ విషయంపై.. స్పందించడానికి అబ్బాయి కుటుంబీకులు నిరాకరించారు. అతను అందుబాటులో లేడని చెప్పారు.
ఇదీ చదవండి: