ETV Bharat / state

ఉపాధ్యాయుల నుంచి నగదు వసూలు.. ఎంఈవో సస్పెండ్

ఉపాధ్యాయుల నుంచి నగదు వసూలు చేసిన ఎంఈవోను సస్పెండ్ చేసిన ఘటన.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో జరిగింది. ఉపాధ్యాయుల బదిలీల సమయంలో సర్వీసు రిజిస్టర్స్ కోసం.. ఉపాధ్యాయులు, ఎంఈవోను సంప్రదించగా.. ఒక్కొక్కరి నుంచి రూ.1000 వసూలు చేసినట్లు యూటీఎఫ్ నాయకులు డీఈవోకు ఫిర్యాదు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. ఆరోపణలు రుజుపు కావటంతో ఎంఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ungutur meo suspend
ungutur meo suspend
author img

By

Published : Apr 28, 2021, 5:32 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎంఈవో దేశాబత్తుల శుభాకర్​రావుపై వేటు పడింది. ఉపాధ్యాయుల బదిలీల సమయంలో సర్వీసు రిజిస్టర్స్ కోసం.. ఉపాధ్యాయులు, ఎంఈవోను సంప్రదించిన సమయంలో.. ఒక్కో ఉపాధ్యాయుని నుంచి రూ.1000 వసూలు చేశారని యూటీఎఫ్ నాయకులు డీఈవో రేణుకకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ఎంఈవోపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో.. కాకినాడ ఆర్జేడీ నరసింహారావు ఎంఈవోను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. మండల విద్యాశాఖలో.. ప్రతి చిన్నపనికి ఎంఈవో అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని డీఈవో రేణుక తెలిపారు.

ఇదీ చదవండి: గుంటూరులో కార్పొరేటర్​ని కొట్టిన యువకుడు.. చితకబాదిన అనుచరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.