భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ.. గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జవాను. మార్కొండపాడుకు చెందిన మల్లిపూడి రజనీకుమార్ లడఖ్ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నాడు. గుండె పోటుతో అక్కడే మృతి చెందిన రజనీ కుమార్ భౌతికకాయాన్ని బుధవారం స్వగ్రామం తరలించారు.
మార్కొండపురంలో అశృనయనాల నడుమ, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి తానేటి వనిత, ఆర్మీ మేజర్ ఎస్.పాల్‌సింగ్, సైనికాధికారులు రజనీకుమార్ భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించారు. కుమార్ మృతదేహంపై జాతీయ జెండా ఉంచి వందన కార్యక్రమం నిర్వహించారు.
దేశం ఒక వీర జవాన్‌ను కోల్పోవడం దురదృష్టకరమని, రజనీ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి తానేటి వనిత అన్నారు. కుమార్ అంతిమ సంస్కారాల్లో.. ఆర్మీ అధికారులు బీవై చౌహాన్, బీహెచ్‌ఎం ప్రసాదరెడ్డి, సీహెచ్‌ఎం బెహ్రవ్, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ సాయిప్రసాదరావు, నోడల్ అధికారి జి.సుధాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: