ETV Bharat / state

West godavari: స్నేహితున్ని కత్తితో నరికిన వ్యక్తి - నేర వార్తలు

అక్రమంగా మద్యం అమ్ముతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు స్నేహితుడినే కత్తితో నరికాడో వ్యక్తి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.

stabbed
స్నేహితున్ని కత్తితో నరికిన వ్యక్తి
author img

By

Published : Jul 11, 2021, 9:27 AM IST

అక్రమంగా మద్యం అమ్ముతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు స్నేహితుడని కూడా చూడకుంటా కత్తితో నరికాడో వ్యక్తి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది.

తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఉరదాల వరప్రసాద్, దేవరకొండ శ్రీనులు స్నేహితులు. వరప్రసాద్​ తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రీను మాంసం దుకాణం నిర్వహంచటంతో పాటు రాత్రివేళల్లో మద్యం విక్రయిస్తుంటాడు. మద్యం అమ్మ వద్దని వరప్రసాద్​.. శ్రీనును మందలించాడు. అతను పట్టించుకోలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు వరప్రసాద్​. అతనిపై కక్ష పెంచుకున్న శ్రీను.. వరప్రసాదు తల, చేతులు, వీపుమీద కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: putta sudhakar yadav: 'వైకాపా పాలనలో అవినీతి పెరిగిపోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.