ETV Bharat / state

నిధులివ్వకుండా సర్వే ఎలా నిర్వహించాలి సార్..? - గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు నిధులు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ నిర్వహణలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. సంక్షేమ కార్యక్రమాల కోసం గ్రామ వాలంటీర్లచే సర్వే నిర్వహించమన్న ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో అధికారుల నానా తంటాలు పడుతున్నారు.

సర్వే కోసం గ్రామ వాలంటీర్ల తంటాలు
author img

By

Published : Aug 22, 2019, 12:15 PM IST

సర్వే కోసం గ్రామ వాలంటీర్ల తంటాలు

వాలంటీర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులతో పాటు వారి అవసరాలను, సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్న తీరును తెలుసుకోవటం కోసం సమగ్ర సర్వేకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వాలంటీర్లు సర్వే కార్యక్రమం చేపట్టగా, పట్టణ ప్రాంతాల్లో ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామాల్లో సంబంధిత మండల పరిషత్ అధికారులు వాలంటీర్లకు గుర్తింపు కార్డులివ్వాలని ప్రభుత్వం సూచించింది.. కానీ వాటికి సంబంధించి ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. తాజాగా గ్రామాల్లో సర్వే కోసం ఒక్కొక్క ఇంటి నుంచి వివరాలు సేకరించడానికి 15 పేజీల నమూనాను విడుదల చేసింది. ఈ నమూనాలు జిరాక్స్ కాపీ తీసి వాలంటీర్లకు అందజేయాలని ఎంపీడీవోలను ఆదేశించింది. ఒక మండల పరిధిలో ఆయా గ్రామాల్లో వేల సంఖ్యలో గృహాలు ఉండడంతో కేవలం జిరాక్స్ కాపీలకే లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి రావడంతో ఎంపీడీవోలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా పంచాయతీ అధికారులను సంప్రదిస్తే తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారులను సంప్రదిస్తే ముందు సర్వే జరిగేలా చూడండి ఖర్చుల గురించి మేము ఆలోచిస్తాం అంటూ తేల్చేస్తున్నారు. దీంతో పురపాలక సంఘాల పరిధిలోని సాధారణ నిధులు ఖర్చుచేయమని కమిషనర్లు భరోసా ఇవ్వటంతో ముందుకు సాగుతున్నారు. కానీ ఈ నిధులు మాత్రం ఎంత వరకు సరిపోతాయో తెలియకపోవటంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని అధికారులు కోరుకుంటున్నారు. మరోవైపు సమగ్ర సర్వేలో నిమగ్నమైన వాలంటీర్లు ప్రభుత్వ సూచనల ప్రకారం వివరాలు సేకరించడానికి నానా తంటాలు పడుతున్నారు.

ఇదీ చూడండి:పారిశ్రామిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఐటీ మంత్రి గౌతంరెడ్డి

Intro:ATP:- అనంత ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో లో కీలకమైన విభాగాల్లో రోగుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. ఎయిర్ కండిషనర్లు మరమ్మతులకు నోచుకోవడం తో రోగులు విలవిలలాడుతున్నారు. నిర్దేశిత విభాగాల్లో ఏసీలో కీలకం రోగులకె కాదు, లక్షలు వెచ్చించిన వైద్య పరికరాలు సైతం ఆయా విభాగాల్లో ఉంటాయి. వీటికి తగిన ఉష్ణోగ్రత చాలా అవసరం లేదంటే ఖరీదైన పరికరాలు కూడా పాడయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వాసుపత్రిలో అక్యూర్ మెడికల్ కేర్ (ఏఎంసి) విభాగం ఇది. గుండెనొప్పి, ఆత్మహత్యాయత్నం , పాము కాటు వంటి ప్రాణాపాయ స్థితిలో వచ్చే రోగులకు ఈఎన్సీ లోనే వైద్య చికిత్స అందించేది. ఏ ఎం సి విభాగం లో ఉన్న మూడు గదుల్లోనూ ఏసీలు పనిచేయడం లేదు. అంతా చీకటీలో బాధిత సహాయకులు ఇళ్ల నుంచి చిన్న చిన్న ఫ్యాన్లు, విసనకర్రల తో గాలిని ఉప్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Body:అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మొత్తం 56 ఏసీ లు ఉన్నాయి. ఇందులో ఏ ఎన్ సి విభాగంలో 5 ఏసీలు, ఎస్ ఐసియులో 3 ఏసీలు, ఐసియులో 4 ఇలా అన్ని ముఖ్యమైన విభాగాల్లో కలిపి 56 ఏసీలు అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 34 ఏసీలు పనిచేయడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఇవి తరచూ మరమ్మతులకు చేరుకోవడం వల్ల ఎక్కువ శాతం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి మొత్తంలోనూ అత్యధికంగా ఏ ఎం సి విభాగంలో లో 10 నుంచి 30 మంది రోగులు చికిత్స నిమిత్తం రోజు అడ్మిషన్ అవుతుంటారు. వీరికి సరైన సౌకర్యాల లేమితో వైద్యం అందడం లేదు. ఈ విభాగంలోకి ఎక్కువ శాతం కొనఊపిరితో వస్తున్న బాధితులే ఎక్కువ. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏసీలకు మరమ్మత్తులు చేయించి బాధితులకు రోగులకు లేకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు.

బైట్....1.రవి, బాధిత సహాయకులు.
2. వెంకటలక్ష్మి,

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.

గమనిక :- ఆంధ్ర ప్రదేశ్ ఈటీవీ భారత్ ఇంచార్జ్ ఎం ఎన్ వి ప్రసాద్ సార్ గారు ఈనాడు లో ప్రచురితమైన వార్తలను గ్రూప్లో సెండ్ చేసిన అంశముపై కథనం చేయమని తెలిపిన అంశంపై ఈ వార్త పంపుతున్నాను పరిశీలించగలరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.