ETV Bharat / state

corruption : నిధులు కాజేశారంటూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు..! - west godavari district

corruption : పశ్చిమగోదావరి జిల్లా వేండ్రలో.. పంచాయతీ నిధులను కాజేశారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా వేండ్ర
పశ్చిమగోదావరి జిల్లా వేండ్ర
author img

By

Published : Dec 27, 2021, 6:37 PM IST

పశ్చిమగోదావరి జిల్లా వేండ్ర

corruption : పంచాయతీ సిబ్బంది ఆరు కోట్ల రూపాయల నిధులను కాజేశారంటూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరు మండలం వేండ్రలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిధులు దుర్వినియోగం చేశారంటూ..వాటికి సంబంధించిన వివరాలతో గ్రామస్థులు ఫ్లెక్సీలు రూపొందించారు.

మాజీ పంచాయతీ కార్యదర్శి ఏసేబు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సురేంద్ర, సర్పంచ్‌ నాగేశ్వరి నిధులు మళ్లించారని ఆరోపిస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని, అందువల్లే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని చెబుతున్నారు.

కొన్నేళ్లుగా గ్రామంలో అభివృద్ధి పేరుతో నిధులను దోచుకుంటున్నారన్నారు. గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమంత్రి జగన్‌ పుట్టినరోజు సందర్బంగా పట్టాలు ఇప్పిస్తామంటూ.. పంచాయతీ అధికారులు ఒక్కొక్కరి నుంచి రూ.పదివేలు చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. వీటన్నింటిపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.