పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణం బోసుబొమ్మ సెంటర్లో ఉన్న ఉష సీడ్స్, సాయి రామ్ సీడ్స్ విత్తనాల దుకాణాల్లో ఏలూరు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏవో శ్రీనివాస్ కుమార్, చింతలపూడి మండల వ్యవసాయ అధికారిణి మీనా కుమారి తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. విత్తనాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వివరాలు సరిగా నమోదు చేయనట్లు గుర్తించారు. అనధికారికంగా నిల్వ ఉంచిన విత్తనాల్లో కొన్ని నకిలీ విత్తనాలుగా అనుమానం వ్యక్తం చేశారు. వాటి నాణ్యతను పరిశీలించేందుకు ల్యాబ్‌కు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ల్యాబ్ నుండి రిపోర్టులు వచ్చిన అనంతరం దుకాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి: మంత్రులు