పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉల్లి మార్కెట్‌పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మార్కెట్ యార్డ్‌కు ఎటువంటి పన్ను కట్టకుండా వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యాపారులను గుర్తించారు. వారివద్ద 17 టన్నుల ఉల్లి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఉల్లి నిల్వలు సుమారు రూ.23 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉల్లి నిల్వలను మార్కెట్ యార్డ్ కార్యదర్శికి అప్పగించారు.
ఇదీ చదవండి: భవిష్యత్ స్వప్నానికి.. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్రణాళిక!