పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో వాహనమిత్ర కార్యక్రమాన్ని... సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు మంత్రి తానేటి వనిత చెక్కులను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 18, 882 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పదివేల ఆర్థిక సాయాన్ని వాహనమిత్ర పథకం ద్వారా అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: అకాల వర్షం.. నీటిమునిగిన ఉప్పు మడులు