ETV Bharat / state

Protocol Issue: పిలిచి అవమానిస్తారా? అధికారులపై ఎమ్మెల్యే ఫైర్​ - పశ్చిమ గోదావరి జిల్లా తాజా వార్తలు

No respect to MLA: పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. వరికోత యంత్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానించిన అధికారులు ఆయన వచ్చేలోపే వైకాపా నాయకులతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొటోకాల్‌ పాటించాల్సిన అవసరం లేదా? అని అధికారులను నిలదీశారు.

mla ramaraju fires on department of agriculture officers
వ్యవసాయశాఖ అధికారులను నిలదీస్తోన్న ఎమ్మెల్యే రామరాజు
author img

By

Published : Apr 29, 2022, 7:58 AM IST

Opening: ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానించిన అధికారులు ఆయన వచ్చేలోపే వైకాపా నాయకులతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో గురువారం చోటు చేసుకుంది. వరికోత యంత్రం ప్రారంభోత్సవానికి ఉదయం 9.41 గంటలకు ఉండిలోని విత్తనాభివృద్ధి క్షేత్రానికి ఎమ్మెల్యే రామరాజు (తెదేపా) చేరుకున్నారు. అప్పటికే వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోకరాజు రామరాజు, ఇతర నాయకులు యంత్రాన్ని ప్రారంభించినట్లు తెలియడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొటోకాల్‌ పాటించాల్సిన అవసరం లేదా? అని అధికారులను నిలదీశారు. పిలిచి ఇలా అవమానిస్తారా? అని ఏడీఏ అనిల్‌కుమారి, ఏవో బి.సంధ్యలను ప్రశ్నించారు.

‘ప్రొటోకాల్‌ పాటించని సంఘటనలు నియోజకవర్గంలో గతంలో చాలాసార్లు జరిగాయి. వాటిపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా. అధికారులు వచ్చి క్షమించమని కోరడంతో ఇబ్బంది పడుతున్నారని వదిలేశా. తిరిగి ఈరోజు ప్రారంభోత్సవానికి పిలిచి అవమానించారు. పిలిచిన వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులకు లేదా? దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా..’ -రామరాజు , ఉండి ఎమ్మెల్యే

ఇదీ చదవండి: Chandrayan-3: ఆగస్టులో చంద్రయాన్‌-3.. ఇస్రో సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.