పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కోరుకొల్లులో కృష్ణ శిలలతో నిర్మించిన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునః ప్రారంభం చేశారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నూతన విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాన్ని ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాళ్లాయపాలెం క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి, పెద్దపులి పాక సిద్ధాంతి వాసుదేవ నందగిరి స్వాముల పర్యవేక్షణలో జరిగింది. ఆలయ శిల్పి సేతు రామన్ని స్వర్ణ కంకణంతో సన్మానించారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండీ :