పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ద్విచక్ర వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపించారు. నిర్లక్ష్యంగా, అవసరంలేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న 70 మంది వాహనాలను సీజ్ చేశారు. నిత్యవసరాలకోసం, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారిని మాత్రమే రహదారులపైకి అనుమతించినట్లు పట్టణ సీఐ రఘు వివరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు ఒకే చోట చేరకుండా ఉండేందుకే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు ఉంటుందనీ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ప్రజలు గడప దాటకుండా పటిష్ఠ చర్యలు