ETV Bharat / state

BANK ROBBERY: క్రికెట్​ బెట్టింగ్​లో పోగొట్టుకున్నారు.. బ్యాంకు చోరీకి ప్లాన్​ - west godavari news

పశ్చిమగోదావరి జిల్లా దిరుసుమర్రు ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్​లో చోరీ చేసేందుకు ఇద్దరు యువకులు యత్నించారు. లూటీ చేసే సమయంలో వచ్చిన శబ్ధాలను విన్న గ్రామస్థులు అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. బెట్టింగ్​లకు అలవాలు పడిన సదరు యువకులు నష్టాలను పూడ్చుకునేందుకు ఇలా చేసినట్లు తేలింది.

BANK ROBBERY
బ్యాంకు టోరీకి ప్లాన్​
author img

By

Published : Jul 10, 2021, 11:24 PM IST

Updated : Jul 11, 2021, 12:27 PM IST

చోరీకి యత్నిస్తూ కెమెరాకు చిక్కిన యువకులు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమర్రులో ఎస్బీఐలో (SBI BANK ROBBERY) దోపిడీకి ఇద్దరు యువకులు ప్రయత్నించారు. బ్యాంకు తాళాలు పగలుగొట్టి లోపలికి వెళ్లిన వారు.. భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అర్దరాత్రి సమయంలో బ్యాంకు లోపలి నుండి శబ్దాలు రావడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.

బ్యాంకు లూటీ కోసం వచ్చిన ఆ యువకులను చాకచక్యంగా పట్టుకున్నారు. స్థానికులు వెంటనే బ్యాంకు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకు దోపిడీకి వచ్చిన ఇద్దరు యువకులు.. యనమదర్ర గ్రామానికి చెందిన తిరుమల రాజేశ్​, భీమవరానికి చెందిన సాగిరాజు సాయికుమార్ వర్మలుగా పోలీసులు గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్​లో నష్టపోయి.. బ్యాంకు దోపిడీకి ప్రయత్నించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

Alert: పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Last Updated : Jul 11, 2021, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.