పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ.. తల్లాడ-దేవరాపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రారంభంలో అన్ని రకాల గ్రేడులను కొనుగోలు చేస్తామని చెప్పిన మార్క్ఫెడ్ ప్రతినిధులు... అనంతరం మాట తప్పారని వాపోయారు. పొగాకు కొనుగోళ్లలో కంపెనీల వైఖరి మారకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీచదవండి.