పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెం, రాజవరం, జీలుగుమిల్లి గ్రామాల్లోని పొగాకు తోటలను జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు వేలం కేంద్రం కార్యనిర్వహణాధికారి వి. మహేశ్ కుమార్ పరిశీలించారు. పొగాకు పంటలో పురుగు మందు అవశేషాలను నిరోధించేందుకు రైతులు బోర్డు సూచనలు పాటించాలన్నారు.
అధిక వర్షాల ప్రభావంతో పొగాకు పంటలో ఆకుముడత తెగులు అధికంగా వ్యాపించిందని మహేశ్ కుమారు చెప్పారు. దీని నివారణకు రైతులు పిండి మిథాలిన్ పురుగుమందులు వాడుతున్నారని... ఉత్పత్తి అనంతరం సేకరించే నమూనాలలో వీటి అవశేషాలు స్పష్టంగా కనబడి కంపెనీలు కొనుగోలు చేయవని తెలిపారు.
బోర్డు ఆదేశాల మేరకు తక్కువ పరిమితిలో పంటలు వేయాలని, నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అధికారి వి. సుదీర్, ఫీల్డ్ సహాయకులు టి. వెంకయ్య, ప్రశాంత్, రైతులు సుంకవల్లి సాయి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి