పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు కొనుగోలును అధికారులు తిరిగి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, మట్ల ఎలిజా పాల్గొన్నారు. మార్చి 19న ప్రారంభమైన ప్రక్రియ కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 21న నిలిపేశారు. ఈ క్రమంలో పంట రంగు మారి ధర కోల్పోయే ప్రమాదం ఉందన్న రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం కేంద్రంతో చర్చించి కొనుగోళ్లు జరిపేలా చేసిందని ఎమ్మెల్యేలు తెలిపారు. వ్యాపారులు ఎక్కువగా పాల్గొని రైతులకు మంచి ధర వచ్చేలా చూడాలని పొగాకు బోర్డు అధికారులను కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పొగాకు కొనుగోలు ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరికి ధర్మల్ స్కానర్తో పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతిరోజు రైతులు, సిబ్బందికి థర్మల్ స్కాన్ చేశాకే అనుమతిస్తామని బోర్డు అధికారులు తెలిపారు. వేలం ప్రక్రియలో రైతులు దగ్గరకు రాకుండా ప్రత్యేక తెర ఏర్పాటు చేసినట్లు వేలం నిర్వహణ అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: