పశ్చిమగోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రారంభించారు. ప్రారంభ ధర కిలో 175 రూపాయలు అని నిర్ణయించగా... రైతులు ఆందోళన చేశారు. కనీస మద్దతు ధర రావడంలేదని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలిరోజు వేలం ప్రక్రియను అడ్డుకున్నారు. సరాసరి ధర కిలోకు రూ.180 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లిలో పొగాకు వేలం తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇదీ చదవండి: జంగారెడ్డిగూడెంలో బంగ్లాదేశ్ యువకుడి అరెస్ట్