ప్రభుత్వం ప్రకటించిన విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో మూడో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 29వ తేదీ నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాలో సుమారు 12 లక్షల 28 వేల మంది రేషన్ కార్డుదారులున్నారు. గత నెల 29వ తేదీన ఈనెల 15వ తేదీన రెండు పర్యాయాలు ఉచిత రేషన్ పంపిణీ చేశారు. మూడో విడత పంపిణీలో బియ్యంతో పాటు కందిపప్పును ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడో విడత రేషన్ పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు - పశ్చిమగోదావరి జిల్లాలో మూడో విడత రేషన్ పంపిణీ
పశ్చిమగోదావరి జిల్లాలో మూడో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బియ్యం, కందిపప్పులను పౌరసరఫరాల శాఖ గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా రేషన్ డీలర్ల వద్దకు చేరాయి.
ప్రభుత్వం ప్రకటించిన విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో మూడో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 29వ తేదీ నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాలో సుమారు 12 లక్షల 28 వేల మంది రేషన్ కార్డుదారులున్నారు. గత నెల 29వ తేదీన ఈనెల 15వ తేదీన రెండు పర్యాయాలు ఉచిత రేషన్ పంపిణీ చేశారు. మూడో విడత పంపిణీలో బియ్యంతో పాటు కందిపప్పును ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
TAGGED:
RATION_DISTRIBUTION