Car accident in AP: రోడ్డు ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో ఉహించలేం. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కారు బీభత్సం సృష్టించింది. శర్మిష్ఠ కూడలి వద్ద రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి ఆగిపోయింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది. కారు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: