జాతీయ రహదారిపై దోపిడీలు చేస్తున్న వ్యక్తులను పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు పట్టుకున్నారు. తణుకు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఘంటా శ్రీను, బరువు లోవరాజు, కోటిపల్లి ప్రవీణ్ కుమార్ అనే ముగ్గురు తణుకు మండలం దువ్వ నుంచి పెరవలి వరకు జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై తిరుగుతుంటారు. ఒంటరిగా వాహనంపై వెళ్తున్న వారిని వెంబడించి .ఖాళీ ప్రదేశంలో వారిని ఆపి, గొడవ పెట్టుకుని, కొట్టి వారివద్ద ఉన్న నగదును, సెల్ ఫోన్లను అపహరించుకపోతారు. వీరిపై నిఘా ఉంచి... పట్టుకున్నామని డీఎస్పీ రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి. చిక్కింది కిలోన్నర పులస చేప