ETV Bharat / state

'రూ.వేలు పెట్టుబడి పెట్టినా... వడ్ల గింజ కూడా దక్కలేదు' - పశ్చిమగోదావరి జిల్లాలో వరద వార్తలు

మరో పక్షం రోజులు ఆగితే బస్తాలకొద్దీ వడ్లు ఇంటికొస్తాయన్న అన్నదాతల ఆశలపై వాయుగుండం వరదనీరు చల్లింది. గింజ దశలో ఉన్న వరిని ముంచెత్తింది. రోజుల తరబడి పంట నీటిలోనే నానింది. ఉద్యానపంటలూ తుడిచిపెట్టుకుపోయాయి. ఎకరానికి వేలల్లో పెట్టుబడి పెట్టినా వడ్లగింజ కాదు కదా... పశువుల మేతకు ఎండుగడ్డి అయినా మిగల్లేదని ఉభయ గోదావరి జిల్లాల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

crop loss
crop loss
author img

By

Published : Oct 25, 2020, 5:37 AM IST

Updated : Oct 25, 2020, 7:08 AM IST

'రూ.వేలు పెట్టుబడి పెట్టినా... వడ్ల గింజ కూడా దక్కలేదు'

పదిహేను రోజుల్లో.. ఎకరాకు పాతిక బస్తాలకు పైగా వడ్లు ఇంటికొస్తాయనే ఆనందంలో ఉన్న రైతులపై తీవ్ర వాయుగుండం విరుచుకుపడింది. గింజ దశలో ఉన్న వరిని వరదై ముంచెత్తింది. వారం, పది రోజులపాటు నీటిలోనే నాన్చింది. లాక్‌డౌన్‌ నుంచి అమ్మకాల్లేక విలవిల్లాడుతున్న పండ్లతోటల రైతులపైనా వాన పిడుగులా పడింది. అరటి, బొప్పాయి పండ్ల తోటలు, మిరప, కూరగాయలు వంటి ఉద్యాన పంటలూ తుడిచిపెట్టుకుపోయాయి. ఖరీఫ్‌ మొదలయ్యాక కొన్నిచోట్ల పైర్లు 3సార్లు మునగ్గా.. మరికొన్నిచోట్ల 2సార్లు ముంపుబారిన పడ్డాయి. రైతులు ఎకరానికి రూ.20 వేలకు పైగా పెట్టుబడి పెట్టినా.. వడ్లగింజ కాదు కదా పశువుల మేతకు ఎండుగడ్డి కూడా మిగలేదని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వరద బాధిత రైతులు 'ఈనాడు- ఈటీవీ- ఈటీవీ భారత్' బృందం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

సాధారణంగా వరి నాలుగు, అయిదు అడుగులు పెరుగుతుంది. వరదలు ముంచెత్తడంతో వరి చేలల్లో వారం, నుంచి 15 రోజుల వరకు తొమ్మిది అడుగుల ఎత్తున నీరు నిలవడంతో కుళ్లిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వరి నీట మునిగింది. ఏలేరు, ప్రత్తిపాడు, పిఠాపురం, కిర్లంపూడి మండలాల్లో నష్టం అధికంగా ఉంది. ఇప్పటికీ పలుచోట్ల వరి పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కట్టలు తెంచుకుంటూ వరదనీరు బయటకు పారుతోంది. ఎర్రకాలువ జలాశయం నుంచి భారీ ఎత్తున వరదనీరు ముంచెత్తడంతో.. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో మాగాణుల్లో తొమ్మిది అడుగుల ఎత్తున నీరు నిలిచింది. 75 వేల ఎకరాల వరకు నీటి ముంపులోనే ఉంది. పది రోజులకు పైగా నీరు బయటకు పోక చాలాచోట్ల వరి కుళ్లిపోయింది. నిడదవోలు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, పాలకోడేరు, ఆకివీడు, భీమవరం, ఆకివీడు, కాళ్ల, అత్తిలి, పెనుమంట్ర, ఆచంట, యలమంచిలి, మొగల్తూరు, నర్సాపురం తదితర మండలాల్లోని వరి చేలల్లో నిలిచిన నీరు నాచుపట్టి పచ్చగా కన్పిస్తోంది. కొన్ని మండలాల్లో రొయ్యల చెరువుల కట్టలు తెగి.. వాగులు, చెరువులు ఏకమయ్యాయి.

నేలకూలుతున్న అరటి, బొప్పాయి తోటలు

రెండు జిల్లాల్లోని లంక గ్రామాల్లో అరటి తోటల రైతులు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోయారు. నీరు బయటకు పోయే కొద్దీ చెట్లు పడిపోతున్నాయి. బొప్పాయి తోటలు విరిగిపడుతున్నాయి. కోకోలో ఎక్కువ రోజులు నీరు నిలవడంతో చెట్లు వాలిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదలకు పండ్ల తోటలు, కూరగాయ పంటలు నీట మునిగాయి. వాటిని తొలగించి అక్టోబరులో కూరగాయ పంటలు వేశారు. అవి కాపు దశకు చేరకముందే మళ్లీ వానలు రావడంతో నీటమునిగి కుళ్లిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతంలో అరటి, రాజమహేంద్రవరం ప్రాంతంలో కూరగాయ పంటలు, నర్సరీలు, పూలతోటలు, కాకినాడ పరిసరాల్లో మిరప, కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రాంతంలో కూరగాయలు, జంగారెడ్డిగూడెంలో అరటి, కూరగాయ పంటలకు పెనునష్టం తలెత్తింది. ఆత్రేయపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం, రావులపాలెం, అమలాపురం, అల్లవరం తదితర మండలాల్లో అరటి, బొప్పాయి, కోకో, జొన్న, పత్తి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. పంట మొత్తం పోయిందని, పొలానికి వెళ్లినా అక్కడ చేయడానికి ఏం మిగిలిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

యజమానులు దయ తలిస్తేనే సాయం

ఉభయగోదావరి జిల్లాల్లో 75% పైగా కౌలు రైతులే. ఉన్న ఎకరం, అరెకరానికి తోడు అయిదారెకరాలు కౌలుకు చేస్తుంటారు. రెండు పంటలకు ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకు కౌలు చెల్లిస్తున్నా వీరికి కౌలు గుర్తింపుకార్డులు ఇవ్వడం లేదు. ‘సొంతం రెండెకరాలు, కౌలుకు అయిదెకరాలు చేస్తున్నా. మొత్తం నీళ్లలోనే ఉంది. వ్యవసాయాధికారులు వచ్చి చూసి పోయారు. పరిహారానికి జాబితాలు రాశామంటున్నారు. నాకు కార్డు లేదు. కౌలు పొలానికి మా రైతు (భూయజమాని) పేరు రాశారు. పరిహారం వచ్చినా ఆయనకే ఇస్తారు’ అని జగన్నాథపురం రైతు వీరరాఘవులు అన్నారు. పదెకరాలు కౌలుకు తీసుకుని వేశా.. కౌలు కార్డు లేదని సుబ్బారావు వాపోయారు.

Last Updated : Oct 25, 2020, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.