లాక్‌డౌన్ దృష్ట్యా పేదలకు మూడోవిడత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేషన్ పంపిణీకి రెవెన్యూ అధికారులు, డీలర్లకు పౌరసరఫరాలశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. బియ్యంకార్డు ఉన్నవారికి ఈ నెల 29 నుంచి మే 10 వరకు ఉచితంగా సరకులు అందించాలని ఆదేశాలిచ్చింది. కరోనా నిబంధనల మేరకు భౌతికదూరం పాటిస్తూ రేషన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. టైంస్లాట్ టోకెన్లతో ఒక్కో దుకాణంలో రోజుకు 30 మందికే సరకుల పంపిణీ చేయాలని, ఈసారి లబ్ధిదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. రేషన్ దుకాణాల వద్ద మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని తెలిపింది. బయోమెట్రిక్‌కు ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
ఇదీ చదవండి : వామ్మో.. ఆ చెట్టంతా కరోనా వైరస్ పువ్వులే!