పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ చోరీ ఘటనలో నిందితుల్ని పోలీసులు 24 గంటల్లో అదుపులోనికి తీసుకున్నారని దేవాదాయశాఖ స్పష్టం చేసింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులు దొరికారని... ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారని అన్నారు.
చోరీకి గురైన హుండీలో 5 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని. ..దొంగతనం చేసిన వారిని బాల నేరస్తులుగా గుర్తించామని దేవాదాయశాఖ కమిషనర్ పి.అర్జున్ రావు వెల్లడించారు. ప్రస్తుతం ఈ దేవాలయం ప్రైవేటు కమిటీ నిర్వహణలో ఉందని .. దేవాదాయశాఖ పరిధిలో లేదని స్పష్టం చేశారు. అయినా.. దేవాదాయశాఖ అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చిందని.. తక్షణమే ఈ కేసును వారు ఛేదించారని తెలిపారు.
ఇదీ చూడండి: