ETV Bharat / state

kolleru:చేపల చెరువుల తవ్వకం, రోడ్ల నిర్మాణాలతో ముప్పు

పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వ్యాపించి ఉన్న కొల్లేరు సరస్సుకు అరడజను ప్రమాదాలు పొంచి ఉన్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ శనివారం విడుదల చేసిన చిత్తడి నేలల నివేదిక వెల్లడించింది. సహజ జలవనరుల వ్యవస్థను ఇష్టారీతిన మార్చడం, పూడిక, కాలుష్యం, ఆక్వా కల్చర్‌, పశుపక్ష్యాదుల సంఖ్య అతిగా పెరగటం, రోడ్డు నెట్‌వర్క్‌ దీనికి ముప్పుగా పరిణమించినట్లు పేర్కొంది.

author img

By

Published : Oct 3, 2021, 4:58 AM IST

కొల్లేరు
కొల్లేరు

పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వ్యాపించి ఉన్న కొల్లేరు సరస్సుకు అరడజను ప్రమాదాలు పొంచి ఉన్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ శనివారం విడుదల చేసిన చిత్తడి నేలల నివేదిక వెల్లడించింది. సహజ జలవనరుల వ్యవస్థను ఇష్టారీతిన మార్చడం, పూడిక, కాలుష్యం, ఆక్వా కల్చర్‌, పశుపక్ష్యాదుల సంఖ్య అతిగా పెరగటం, రోడ్డు నెట్‌వర్క్‌ దీనికి ముప్పుగా పరిణమించినట్లు పేర్కొంది. దేశంలోని చిత్తడి నేలల వివరాలను పొందుపరుస్తూ రూపొందించిన ఇండియా వెట్‌ల్యాండ్‌ పోర్టల్‌ను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా నివేదిక విడుదల చేశారు. వర్షాకాలంలో కొల్లేరు నీటిని సముద్రం వైపు మళ్లించే విషయంలో నియంత్రణ కొరవడటం వల్ల ఇక్కడ తరచూ వరదమట్టం పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. దీనివల్ల ఏలూరు, గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద వరదలు వస్తున్నట్లు తెలిపింది. వరి రెండో పంటతోపాటు, 5వ కాంటూరు కంటే కింద ఉన్న చేపల చెరువులన్నీ మునిగిపోతున్నట్లు పేర్కొంది. ఈ సరస్సులోకి నీటిని తీసుకొచ్చే మార్గాలన్నీ వేసవిలో ఎండిపోతున్నాయని, ఫలితంగా సరస్సు విస్తరణ 10 వేల ఎకరాల మేరకు తగ్గిపోతున్నట్లు వెల్లడించింది.

మురుగునీటికి అడ్డుకట్టతో ప్రమాదం

చేపల చెరువుగట్లు, సరస్సు భూభాగంలో మూడు ప్రధాన రోడ్లు నిర్మించడం కొల్లేరులో మురుగునీటి ప్రవాహానికి ఆటంకంగా మారినట్లు నివేదిక పేర్కొంది. వాన నీరు ఎగదన్నడం, వ్యవసాయ భూముల నుంచి వచ్చే నీటిప్రవాహాల కారణంగా వర్షాకాలంలో నాలుగైదేళ్లకోసారి వరదలొచ్చి, భారీ ఆర్థిక నష్టం సంభవిస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల పంటలతో పాటు 15 అడుగుల ఎత్తులో ఉన్న చేపల చెరువులు కూడా మునిగిపోవడం, ఏలూరు నగరంలో ఒక్కోసారి వారంపాటు నీరు నిలిచిపోవడం, పశుగ్రాసం కొట్టుకుపోవడం, దోమలు విపరీతంగా పెరిగిపోయి రోగాలు వ్యాపించడంలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు పేర్కొంది. ఇక్కడ రసాయనాల సాంద్రత పెరిగిపోతుండటం సరస్సులోని నీటి నాణ్యతను దెబ్బతీయడంతోపాటు చేపలు, పక్షుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోందని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వేసవిలో భూగర్భజలాలు తగ్గిపోవడానికి కారణమవుతోందని విశ్లేషించింది.

ఉప్పుటేరు పొడవు తగ్గించి, వెడల్పు చేసిన తర్వాత సరస్సుకు అలల తాకిడి పెరిగిందని.. తుపాను సమయంలో వచ్చే అలల కారణంగా లవణ స్థాయి ఎక్కువైందని గుర్తు చేసింది. అది కొల్లేరు సరస్సు జీవ వైవిధ్య నాణ్యతను శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం ఉన్నట్లు పేర్కొంది. గత దశాబ్ద కాలంలో ఈ సరస్సుకు చెందిన 20 వేల హెక్టార్ల భూమి చేపల చెరువులుగా మారిపోయిందని.. అది సరస్సు సహజగుణాన్ని దెబ్బతీస్తున్నట్లు పేర్కొంది. కొల్లేరు సరస్సు కుంచించుకుపోయేకొద్దీ ఇక్కడి ఎన్నో జీవజాతుల పునరుత్పత్తి ప్రాంతాలపై ప్రభావం పడుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 2,16,363 హెక్టార్ల పరిధిలో 9 చిత్తడి నేలలు విస్తరించినట్లు ఈ పోర్టల్‌ వెల్లడించింది.

ఇదీ చదవండి:

బుచ్చిరెడ్డిపాలెంలో దంపతులపై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.