పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా న్యాయస్థానాల ఆవరణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాంటీన్ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్.శ్యాంప్రసాద్, జస్టిస్. ఏవీ శేషసాయి పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సునీత, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్యాంటీన్ నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు భూమి పూజ చేశారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని, శనివారంపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని న్యాయమూర్తులు సందర్శించారు. వసతి గృహంలోని బాలల ఆరోగ్యం, విద్య వంటి అంశాలను పరిశీలించారు. ఆ తరువాత న్యాయమూర్తులు జిల్లా జైలును సందర్శించి అక్కడ ఖైదీల భోజన వసతి సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
క్యాంటీన్ నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు భూమి పూజ - ఏలూరులో హైకోర్టు న్యాయమూర్తుల వార్తలు
ఏలూరులోని జిల్లా న్యాయస్థానాల ఆవరణలో క్యాంటీన్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ .శ్యాంప్రసాద్, జస్టిస్. ఏవీ శేషసాయిలు పాల్గొన్నారు.