తమ్మిలేరులో ఈత కొడుతుండగా.. థర్మకోల్ షీట్ బోల్తాపడి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి బాలుడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఏలూరు 32 సంజీవ్ గాంధీ కాలనీ మురుగు కాల్వ రోడ్లో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో ఇటీవల వింత వ్యాధి బారినపడి ప్రజలు అస్వస్థతకు గురికావటంతో.. ఆ బాలుని తల్లిదండ్రులు జంగారెడ్డి గూడెంలోని అమ్మమ్మ ఇంటి వద్ద విడిచి వెళ్లారు. పరిస్థితి చక్కబటంతో తిరిగి ఇంటికి వచ్చిన ఆ బాలుడు.. తోటి స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఈక్రమంలో స్నేహితులతో కలిసి తమ్మిలేరులో ఈతకొడుతూ ప్రమాదవశాత్తు బాలుడు నీటిలో మునిగిపోయి దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై నాగబాబు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి...: గాలాయగూడెంలో ఇద్దరు బాలురు అదృశ్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు