పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది ఎకరాల గడ్డి దగ్ధం అయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చని బాధిత రైతులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.