ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనంలో శిక్షణ

ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు చిత్రలేఖనంపై కూడా శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల అభిరుచిని బట్టి వివిధ టెక్నికల్ బోర్డు వారు నిర్వహించే పరీక్షలకు కావల్సిన మెళకువలు నేర్పుతున్నారు.

చిత్రలేఖనంపై ఆశక్తి పెంచుతున్న ప్రభుత్వ పాఠశాల
author img

By

Published : Jul 17, 2019, 4:58 PM IST

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనంలో శిక్షణ

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చిత్రలేఖనంలో రాణిస్తున్నారు. ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యతోపాటు వృత్తి విద్యా కోర్సులను అమలు చేస్తున్నారు. చిత్రలేఖనం, కుట్టు శిక్షణ, అల్లికలు తదితర వాటిని నేర్పిస్తున్నారు. దెందులూరు మండలం, కొవ్వలి గోపన్నపాలెం ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం నేర్చుకుంటున్న విద్యార్థులు టెక్నికల్ బోర్డు వారు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పై పరీక్షకు తయారవుతున్నారు. అందమైన చిత్రాలు నేర్చుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించుకుంటున్నారు. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల అభిరుచిని బట్టి వారికి కావల్సిన నైపుణ్యాల్ని అందిస్తున్నారు.

ఇదీ చూడండి:బొట్టు బొట్టును ఒడిసి పట్టండిలా...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.