అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 300 రోజులు పూర్తయిన సందర్భంగా... పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెదేపా ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటించారు. రైతులకు మద్దతుగా సంఘీభావం ప్రకటించడంతో పాటు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.
దెందులూరులో..
రాజధాని అమరావతి రైతులు చేస్తున్న నిరాహార దీక్షలకు మద్దతుగా దెందులూరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.
నరసాపురంలో...
అమరావతి రైతులకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో... తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. నరసాపురంలోని పలు వీధుల్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
జంగారెడ్డిగూడెంలో..
ఒకే రాష్ట్రం ఓకే రాజధాని అంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద... తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు.
జీలుగుమిల్లిలో...
మూడు రాజధానులు వద్దంటూ జీలుగుమిల్లిలో తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రధాన సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రదర్శన చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ఉండవల్లి సోమసుందరం హాజరయ్యారు. తహసీల్దార్ ఎలీసాకు వినతిపత్రం అందజేశారు.
తణుకులో...
అమరావతి రైతులు 300 రోజులుగా చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా... తణుకులో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అమరావతి... రాష్ట్రానికి నడిబొడ్డున ఉండటం వల్ల రాజధానిగా చేస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: