పశ్చిమ గోదావరి జిల్లా తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వచ్ఛందంగా రహదారికి మరమ్మతులు చేయించడం వివాదంగా మారింది. గుంతలతో ఇబ్బందికరంగా మారిన రోడ్లకు సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు, గోపన్నపాలెం మధ్యగల రహదారిలో గుంతలు పూడ్పించారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్.. ఆ పనులు అడ్డుకున్నారు. రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, పనులు చేస్తామని తెలిపారు. ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాత్కాలికంగా గుంతులు పూడ్చి వెళ్తామని చింతమనేని బదులిచ్చారు. సర్పంచ్ పనులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పట్టించుకొకుండా పట్టించుకోకుండా చింతమనేని రహదారికి మరమ్మతులు చేయించారు. ప్రజల ఇబ్బందులు పడుతుండడం వల్ల ప్రభుత్వానికి కనువిప్పు కలిగించటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండీ.. MP RRR LETTER TO CM: నిధులు దారి మళ్లిస్తే ఉత్పాతమే