ETV Bharat / state

CHINTAMANENI PRABHAKAR: పోలీసు వాహనాన్ని వెంబడించిన తెదేపా నేత చింతమనేని.. ఎందుకంటే..? - టీడీపీ వార్తలు

శాంతియుతంగా నిరసన చేపడుతున్న ఎస్సీ సెల్ అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్​ను పోలీసులు చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనను విడిపించేందుకు తెదేపా నేత చింతలపూడి ప్రభాకర్ పోలీసు వాహనాలను వెంబడించారు.

CHINTAMANENI PRABHAKAR
CHINTAMANENI PRABHAKAR
author img

By

Published : Nov 21, 2021, 5:56 PM IST

పోలీసు వాహనాన్ని వెంబడించిన తెదేపా నేత చింతమనేని

చంద్రబాబు నాయుడు కుటుంబంపై.. వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా(TDP Leaders protest over YSRCP comments on chandrababu).. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెదేపా నేతలు, కార్యకర్తలు రహదారులపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో వైకాపా దిష్టిబొమ్మ దహనం చేశారు. దీంతో.. పోలీసులకు, తెదేపా నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది.

ఈ క్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్​ను పోలీసులు కొట్టుకుంటూ.. బలవంతంగా లాక్కెళ్లి ఆటో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. రాత్రంతా కస్టడీలో ఉన్న శ్రీనివాస్ ను.. ఉదయం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

దీంతో.. పోలీసులు ఆయనను టీ.నరసాపురం మండలం నుంచి ధర్మాజీగూడెం పోలీసు స్టేషన్ కు కారులో తరలించారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసు (Chintamaneni prabhakar chased police vehicles) వాహనాన్ని వెంబడించారు. అనంతరం పల్లి శ్రీనివాస్ ను 41 నోటీసు జారీ చేసి, స్టేషన్ బెయిల్ మంజూరు చేసి పోలీసులు విడుదల చేశారు. రాజ్యాంగ బద్ధంగా నిరసన తెలుపుతున్న వారిని అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని చింతమనేని నిలదీశారు.

ఇదీ చదవండి:

AP NIT: ప్రత్యేక ఆకర్షణగా ఏపీ నిట్‌.. అభివృద్ధి దిశగా పయనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.