పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఆ ఇంటి యజమాని ప్రాణాలు తీసుకునేలా చేశాయి. మండపాక గ్రామానికి చెందిన పొట్ల ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. మనస్తాపానికి గురైన ప్రసాద్ ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని అన్న కుమారుడు రాజీవ్ గాంధీ తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :
చిన్న తిరుపతికి.. కాలినడక వెళ్తోన్న భక్తులపై దూసుకెళ్లిన లారీ