పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా ఆర్ ప్రభాకర్‌రావు బాధ్యతలు చేపట్టారు. భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించటమే తన ధ్యేయమని ఆయన అన్నారు. తనది ప్రకాశం జిల్లా అని, డిప్యూటీ కలెక్టర్ హోదాలో పశ్చిమగోదావరి జిల్లాలో కోనేరు రంగారావు కమిటీకి అధికారిగా పనిచేస్తూ బదిలీపై స్వామి వారి ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి దేవాలయాల్లో భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు.
ఇవీ చూడండి...