పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే చిన్నతనం నుంచి ఎనలేని అభిమానం. ఆయన గానామృతాన్ని వింటూ మైమరచిపోతారు. తమ అభిమాన గాయకుడు మృతి చెందడం చంద్రశేఖర్‌ను బాధించింది. స్వతహాగా శిల్పి అయిన చంద్రశేఖర్ తమ అభిమాన నాయకుడి ప్రతి రూపాన్ని ఆవిష్కరించాలని భావించారు.
అనుకున్నదే తడవుగా విగ్రహానికి రూపొందించారు. విగ్రహంలోని అణువణువు తనదైన నైపుణ్యంతో తీర్చిదిద్ది సజీవ రూపం ఆపాదించారు. తమ అభిమాన గాయకుడు ప్రతిరూపాన్ని తమ ముందు కనిపించేలా ఉండాలన్న కోరికతో విగ్రహం రూపొందించానని, తన శిల్పకళా వేదికకు వచ్చే వారు చూసి తరించాలని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. అభిమాన గాయకుడి విగ్రహాన్ని తీర్చిదిద్దిన చంద్రశేఖర్‌ను పలువురు అభినందించారు.
ఇదీ చదవండి: