ETV Bharat / state

ఉండ్రాజవరం గోకర్ణేశ్వర స్వామి ఆలయం.. భక్తులతో కిటకిట - Shivratri celebrations at Gokarneshwara Swamy Temple

మహా శివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. తణుకు మండలం ఉండ్రాజవరం గోకర్ణేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

Shivratri celebrations at Gokarneshwara Swamy Temple in Undrajavaram, West Godavari District
భక్తులతో కిటకిటలాడిన ఉండ్రాజవరం గోకర్ణేశ్వర స్వామి ఆలయం
author img

By

Published : Mar 11, 2021, 8:32 AM IST

శివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ఉండ్రాజవరం గోకర్ణేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు చేరుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు.

రాజరాజనరేంద్రుని కాలం నాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో.. మహాశివరాత్రి వేళ స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా దేవాలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:

'పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ను చంద్రబాబు హయాంలోనే కట్టారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.