ETV Bharat / state

'ఏఎన్ఎంలకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలి'

author img

By

Published : Apr 7, 2020, 3:06 PM IST

సచివాలయాల్లో పనిచేస్తున్న తమకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలని గ్రేడ్-3 ఏఎన్ఎంలు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలని ప్రకటించినా... అధికారులు మాత్రం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

secretariat affiliated grade three anms demand to give full salary
ఏఎన్ఎంలకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలి

కరోనా వ్యాప్తి నివారణకు విధులు నిర్వహిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలని సీఎం జగన్ అధికారులను ఇప్పటికే ఆదేశిస్తామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో... సచివాలయం పరిధిలో గ్రేడ్​-3 ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని గుర్తు చేశారు. తమకు అధికారులు పూర్తి జీతం అందజేయటం లేదని ఆరోపించారు. మార్చి నెల జీతాలకు సంబంధించి రూ.15 వేలలో రూ.1500 తగ్గించి జీతాలు చెల్లించారని వారు ఆవేదన చెందారు. దూరప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కరోనా నివారణ విధులకు హాజరవుతున్న తమకు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా చెల్లించడం లేదన్నారు. నిత్యం రూ.100కు పైగా వెచ్చించి విధులకు హాజరు కావాల్సి వస్తోందని వాపోయారు. ప్రస్తుతం తమకు ఇచ్చే జీతాల్లో రూ.1500 తగ్గిస్తున్న కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

పోలీసులు, వాలంటీర్లకు మాస్కుల పంపిణీి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.