ETV Bharat / state

Bullet: కోడి పందెం విజేతకు.. 2.40 లక్షల డుగ్గు డుగ్గు బండి! - బుల్లెట్ బండి తాజా వార్తలు

Cock Fight: సంక్రాంతి సంబురాలకు కేరాఫ్‎గా చెప్పుకునే ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం బరుల వద్ద రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా శృంగవక్షంలో ఇద్దరు స్నేహితులు బుల్లెట్ బండిని పందెంలో పెట్టారు. కోడి పందెంలో గెలిచిన వ్యక్తి రాయల్ ఎన్‌ఫీల్డ్​ను సొంతం చేసుకున్నారు.

కోడిపందెం విజేతకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ బహుమతి

author img

By

Published : Jan 15, 2022, 7:27 PM IST

Updated : Jan 15, 2022, 9:57 PM IST

Cock Fight: సంక్రాంతి అంటే గంగిరెద్దులు, హరిదాసుల కోలాహలం, ముగ్గులు, గొబ్బెమ్మలు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. కోడి పందేలు మరో ఎత్తు. సంక్రాంతి సంబురాలకు కేరాఫ్‎గా చెప్పుకునే ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా నడుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా శృంగవక్షంలో ఇద్దరు స్నేహితులు కోడి పందేల్లో బుల్లెట్​ బండిని పందెంలో పెట్టారు.

వివరాల్లోకి వెళితే.. పాలకోడేరు మండలం శృంగవక్షంలో కౌరు రామయ్య అతని స్నేహితుడు కలిసి రూ.2.40లక్షల విలువైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను ఇటీవల కొనుగోలు చేశారు. ఇవాళ కోడి పందేల్లో పాల్గొన్న ఇద్దరూ బుల్లెట్‌ను పందెంలో పెట్టారు. ఈ పందెంలో కౌరు రామయ్య విజయం సాధించి బుల్లెట్‌ను సొంతం చేసుకున్నాడు. గెలుపొందిన ఆనందంలో బుల్లెట్‌తో బరిలోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టాడు. వినూత్నంగా నిర్వహించిన ఈ కోడి పందేన్ని.. పందెం రాయుళ్లు, జనాలు ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చదవండి

kodi Pandelu: సందడిగా కోడి పందేలు.. కో అంటే కోట్లు!

Last Updated : Jan 15, 2022, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.