పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్విలిలో రైతులే స్వచ్ఛందంగా పంట పొలాలకు రహదారి ఏర్పాటు చేసుకుంటున్నారు. సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పొలాలకు సరైన రోడ్డు సౌకర్యం లేని కారణంగా.. వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామానికి దిగువన సుమారు 5 కిలోమీటర్ల మేర పొడవున మార్గం ఉన్నా.. సరైన రహదారి సౌకర్యం లేక, కూలీలు రాకపోకలకు, ఎరువులు వేసేందుకు ఇన్నాళ్లూ కష్టపడ్డారు.
తమ సమస్యను తామే పరిష్కరించుకునేందుకు రైతులంతా చేయీ చేయీ కలిపారు. విరాళాలు వేసుకొని పంట పొలాలకు రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. రహదారి ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు డబ్బును చెల్లిస్తున్నారు. ప్రాథమికంగా మట్టి తరలింపు పనులు సాగిస్తున్నారు. ఈ ఏడాది మట్టితో రహదారి ఏర్పాటు చేస్తామని, వచ్చే సంవత్సరం మెటల్, గ్రావెల్‌తో రోడ్డును నిర్మిస్తామని రైతు పర్వతనేని కమలాకర్‌రావు తెలిపారు.
ఇదీ చదవండి: