పశ్చిమగోదారి జిల్లా ఉంగటూరు మండలం కైకవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చేబ్రోలు ఎస్ఐ వీర్రాజు తెలిపిన వివరాలు ప్రకారం.... కైకరం గ్రామానికి చెందిన గొల్లపల్లి పాల్గుణ (55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాల కేంద్రానికి పాలు పోసేందుకు ద్విచక్ర వాహనం పై బయలుదేరాడు. స్థానిక కూడలిలో రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇన్నోవ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాల్గుణ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలోని శవగారానికి తరలించారు.
ఇదీ చూడండి 2 వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి