ETV Bharat / state

50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. డీలర్​పై కేసు నమోదు - జంగారెడ్డిగూడెంలో రేషన్ బియ్యం పట్టివేత వార్తలు

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానికులు పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.

ration rice caught by police
50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Sep 2, 2020, 11:24 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ రేషన్ దుకాణం నుంచి వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్థానికులు పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

ration rice caught by police
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనం

కరోనా కారణంగా తెల్లకార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యంను పంపిణీ చేస్తోంది. దీన్ని అదునుగా తీసుకొని రేషన్ డీలర్లు ప్రజల వద్ద నేరుగా బియ్యాన్ని కొనుగోలు చేసి.. నల్ల బజారులో విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో వ్యాపారం కొనసాగుతుంది. జిల్లాలో జంగారెడ్డి గూడెం, ఏలూరు, చింతలపూడి, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, తాళ్లపూడి, కొయ్యలగూడెం, గోపాలపురం తదితర మండలాల్లో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం యథేచ్చగా సాగుతోంది. ఈ విధంగా తరలిస్తున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సమీపంలో 41వ రేషన్ దుకాణ డీలర్​పై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: రాజుపోతేపల్లిలో పెట్రోలు బంక్​ సీజ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.