పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో రైతులు ఖరీఫ్ పంట సాగుకు సన్నద్ధమయ్యారు. అందుకు నారుమళ్లను సిద్ధం చేశారు. మరోవైపు నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ నారుమళ్లు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో హెక్టారుకు సరిపోయే నారుమడికి రైతులు మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. తణుకు, ఉండ్రాజవరం, ఇరగవరం, అత్తిలి, నిడదవోలు, పెరవలి.. మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా నారుమళ్లు చాలా వరకు ముంపునకు గురయ్యాయి. నీటమునిగిన నారుమళ్లను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. మోటార్లను ఏర్పాటు చేసి నారు మళ్లలోని నీటిని బయటికి తోడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మునిగిపోయిన నారుమళ్లు మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితిలో ఉంటే నారు పనికిరాదని అంటున్నారు.
ఎడతెరిపి లేని వర్షాలు.. నీట మునిగిన నారుమళ్లు - rain effect in west godavari district
అల్పపీడన ప్రభావంతో గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ పంట కోసం వేసిన నారుమళ్లు నీటమునిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.