పశ్చిమ గోదావరిలో పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా.. రబీ సీజన్‌ను ముందుకు తీసుకొచ్చారు. రబీ పంటల సాగుపై వ్యవసాయ అధికారులతో కలెక్టర్ ముత్యాలరాజు సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 నాటికి రబీ సాగు పూర్తిచేయాలని ఆదేశించారు.
మార్చి 31, 2021 నాటికి పోలవరం ప్రాజెక్టుకు నీటి సరఫరాను నిలిపివేసి.. పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో రబీ పంటసాగుపై రైతులకు అధికారులు ముందుగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పంటలు ఎండిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: