ETV Bharat / state

ఫామ్​హౌస్​​లో కొండచిలువ హల్​చల్​ - బీమోలులో కొండచిలువ కలకలం వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం బీమోలులో కొండచిలువ కలకలం రేపింది. ఓ రైతు ఏర్పాటు చేసుకున్న ఫౌమ్​హౌస్​​లోని బాతును చంపేసి...మరోబాతుని మింగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు కొండచిలువను పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.

bhimolu
bhimolu
author img

By

Published : Sep 12, 2020, 9:32 PM IST

ఫామ్​హౌజ్​లోకి దూరిన కొండచిలువ

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం బీమోలులో కొండచిలువ కలకలం రేపింది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో రైతు మంచికంటి లక్ష్మణరావు ఫామ్‌హౌస్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో బాతులతోపాటు ఇతర మూగజీవాలు ఉన్నాయి. అయితే ఫామ్​హౌస్​లోకి దూరిన భారీ కొండ చిలువ ఓ బాతును చంపేయగా.. మరో బాతును మింగేసింది. ఆ తర్వాత ఓ ప్లాస్టిక్‌ డ్రమ్‌లోకి దూరి అందులో చాలాసేపు ఉండిపోయింది. బాతుల కదలిక, శబ్దాలు లేకపోడవంతో అప్రమత్తమైన రైతు...ఫామ్​హౌస్​ను క్షుణ్ణంగా పరిశీలించారు. కొండచిలువ ఓ బాతును చంపేసిన ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. వారి సహాయంతో కొండచిలువ ప్లాస్టిక్‌ డ్రమ్‌లో ఉన్నట్లు గుర్తించారు. కొండచిలువను చంపాలని స్థానికులు అంతా భావించినా... రైతు లక్ష్మణరావు అందుకు నిరాకరించి అటవీశాఖ సిబ్బందికి సమాచారం తెలిపారు. ఫామ్​ హౌస్​కుకు చేరిన అటవీశాఖ బృందం... కొండ చిలువను పట్టుకుని అడవిలో వదిలారు.

ఇదీ చదవండి

శ్రావణి ఆత్మహత్య: బయటపడ్డ ఫోన్​ కాల్​ రికార్డులు.. దర్యాప్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.