పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరం కూడలిలో జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వలస కూలీలు, వాహనచోదకులు 1100 మందికి సాగిరాజు సాయి కృష్ణంరాజు భోజనం అందజేశారు. సింగవరం కూడలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయా ప్రాంతాల నుంచి తరలి వెళ్తున్న వారికి భోజన పొట్లాలు, తాగు నీటి ప్యాకెట్లు, పేపర్ కంచాలు అందించారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు తమవంతు సహాయంగా వీటిని అందజేస్తున్నట్లు సాయి కృష్ణంరాజు తెలిపారు.
ఇదీ చూడండి ప్రజాప్రతినిధులే నిబంధనలు పాటించకపోతే ఎలా..?: హైకోర్టు