పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే గృహాల పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్ ఆర్కే జైన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల పునరావాస కాలనీల నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం పరిశీలించింది. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నాణ్యత పరంగా నిర్వాసితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని మీడియాకు తెలిపారు. ఆర్ అండ్ ఆర్, జలవనరుల శాఖ అధికారులతో విజయవాడలో జరగనున్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో తమ 3 రోజుల పర్యటన వివరాలు తెలియజేస్తామన్నారు
నిర్వాసితుల ఇళ్ల పనుల్లో జాప్యంపై పీపీఏ అసంతృప్తి - ppa
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేయనున్న గృహాలకు సంబంధించిన నిర్మాణ పనులను.. ప్రాజెక్టు అథారిటీ బృందం పరిశీలించింది.