పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. పంచాయతీ బిల్ కలెక్టర్‌కు ఇటీవల మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో తేడాలు రావటంతో కరోనా ప్రాథమిక పరీక్ష రాపిడ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షలో అతడికి పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో ఏలూరులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. నాగులగూడెం గ్రామంలోని పంచాయతీ అధికారులు ఉదయం నుంచి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇతర గ్రామాల నుంచి ఎవరూ గ్రామంలోకి రాకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటించి పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.
జంగారెడ్డిగూడెం మండలంలో కరోనా పాజిటివ్ కేసు - corona positive cases news in west godavari
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. మండలంలోని నాగుల గూడెం గ్రామానికి చెందిన బిల్ కలెక్టర్‌కు కరోనా ప్రాథమిక పరీక్ష నిర్వహించగా... పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. పంచాయతీ బిల్ కలెక్టర్‌కు ఇటీవల మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో తేడాలు రావటంతో కరోనా ప్రాథమిక పరీక్ష రాపిడ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షలో అతడికి పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో ఏలూరులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. నాగులగూడెం గ్రామంలోని పంచాయతీ అధికారులు ఉదయం నుంచి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇతర గ్రామాల నుంచి ఎవరూ గ్రామంలోకి రాకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటించి పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ సడలించినా.. తగ్గిన సంక్రమణ వేగం!