పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పహారా కాస్తూ.. కఠిన ఆంక్షలు విధించారు. దీంతో వైకాపా నాయకులు సైతం ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో వామపక్ష పార్టీలు, రైతు సంఘ నాయకులను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఆశ్రం క్రీడా మైదానం వద్ద, హెలీప్యాడ్, ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంలో వైకాపా నేతలను కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ కారణంతో పలువురు ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పాసులు ఉన్నా కొన్నిచోట్ల మీడియాను సైతం పోలీసులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి: ఏలూరులో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన