పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి నుంచి దర్భగూడెం వరకు జాతీయ రహదారిపై ఉన్న గోతులను పోలీసులు మట్టితో పూడ్చివేయించారు. గోతుల వల్ల రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకు స్వచ్ఛందంగా గుంతలు పూడ్పించామని ఎస్సై విశ్వనాథ బాబు తెలిపారు.
సుమారు 6 కిలోమీటర్ల వ్యవధిలో వందలాది గోతులను మట్టితో పూడ్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి శాశ్వతంగా గోతులు నిర్మూలించి వాహనచోదకుల ఇబ్బందులను తొలగించడానికి కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి: