ETV Bharat / state

అంతరాష్ట్ర దొంగ... బాహు భాషా కోవిదుడు

ఎదుటివారిని మోసగించడమే తన వృత్తిగా పెట్టుకున్నాడతను. ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఈ దొంగ..అలవోకగా అమాయకులను మోసం చేస్తాడు. పలు రాష్ట్రాల్లో ఇతనిపై కేసులున్నప్పటీకీ బెయిల్ పై తిరిగొచ్చి మళ్లీ వృత్తిని కొనసాగిస్తున్నాడు. ఎట్టకేలకు పోలీసులు పక్కా సమాచారంతో ఈ దొంగను పట్టుకున్నారు.

author img

By

Published : Nov 13, 2019, 3:17 PM IST

అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న ఏలూరు పోలీసులు
ఈ అంతరాష్ట్రదొంగ ...బాహుభాషా కోవిదుడు

వరుసగా మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడెంకు చెందిన భీముడు అజిత్ కుమార్ తండ్రి నరసింహారెడ్డి గ్రానైట్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలోని మెలకువలు నేర్చుకుని.. ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ సాయి గ్రానైట్ అండ్ ఎక్స్​పోర్ట్​ పేరుతో పలు రాష్ట్రాల వ్యాపారులతో గ్రానైట్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. సరకు పంపిస్తున్నానని.. గతంలో లారీలో లోడ్ చేసిన గ్రానైట్ ఫోటోలను వ్యాపారులకు పంపించి తన బ్యాంకులో సొమ్ములు జమ చేయించుకున్నాడు. వ్యాపారులతో అజిత్ కుమార్ డ్రైవర్​ని అంటూ మరో నిందితుడు నెక్కలపు ఆకాష్ మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా పలురాష్ట్రాల వ్యక్తులను మోసం చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులని అరెస్ట్ చేశారు. బెయిల్​పై బయటకు వచ్చి అజిత్ పలు నేరాలు చేశాడు. ఇతను ఆరు భాషల్లో మాట్లాడగలడు. ఇతనిపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. వారి వద్ద నుంచి 55 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.1 లక్షా 60 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచూడండి.అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. 20 మందికి గాయాలు

Intro:AP_TPG_06_12_ANTHAR_RASTRA_MUTAA_ARREST_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) ఎదుటి మోసగించడమే తన వృత్తి పెట్టుకున్నాడతను... ఆ మార్గంలోనే మోసాల మీద మోసాలు చేస్తూ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీషు హిందీ తమిళం మలయాళం అరబిక్ భాషలో ప్రావీణ్యం సంపాదించిన ఆ నేరస్తుడు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలలో కొన్ని మోసానికి పాల్పడ్డాడు. గతంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేసిన న బెయిల్పై వచ్చి కూడా యథాతథంగా మోసాలు కొనసాగిస్తున్నాడు. ఆ ఆ నిందితుడ్నీ, అతనికి సహకరించిన మరొక వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను ఏలూరు డి ఎస్ పి దిలీప్ కిరణ్ మీడియాకు వెల్లడించారు.

Body:భీముడు అజిత్ కుమార్ అనే వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం నాగన్న గూడెంలో నివాసం ఉంటున్నాడు. నరసింహారెడ్డి తమిళనాడుకు చెందిన వ్యక్తి. తల్లి నాగన్న గూడెం ప్రాంతానికి చెందిన మహిళ. నరసింహారెడ్డి గ్రానైట్ వ్యాపారం చేసేవాడు . అతను ఇటీవల మృతి చెందాడు. తండ్రి వద్ద వ్యాపార మెళకువలు తెలుసుకుని అజిత్ కుమార్ 2018లో ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ సాయి గ్రానైట్ అండ్ ఎక్స్ పోర్ట్ కంపెనీ పేరిట దుకాణాన్ని ప్రారంభించాడు. అక్కడే సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో మోసాలకు తెరతీశాడు. తండ్రి గ్రానైట్ వ్యాపారస్తుడు కావడంతో అజిత్ కుమార్ కు పలు రాష్ట్రాలకు చెందిన గ్రైనేట్ వ్యాపారులతో పరిచయాలున్నాయి. మరి కొంతమంది వ్యాపారులు ఫోన్ నెంబర్లు సేకరించే వాడు. మంచి గ్రైనేట్ సరుకు ఉందని పంపిస్తానని వారితో బేరం కుదుర్చుకునేవాడు. సరుకు లారీలో పంపిస్తాను అంటూ గతంలో లారీ లోడ్ చేసిన ఫోటోలను వాట్సాప్లో వ్యాపారులకు పంపించి తన బ్యాంకులో సొమ్ములు జమ చేయించుకునేవాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో ఉండే వాడు కాదు. వ్యాపారులతో అజిత్ కుమార్ డ్రైవర్ ని అంటూ మరో నిందితుడు నెక్కలపు ఆకాష్ మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా అనేక ప్రాంతాల్లో వ్యాపారులను మోసం చేయడంతో బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బెయిల్పై బయటికి వచ్చిన నిందితుడు మళ్లీ 2019లో విశాఖపట్నంలో మరొక గ్రానైట్ సంస్థ ను స్థాపించి తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యాపారులను మోసగించారు . విశాఖపట్నంలో కూడా వీరిపై రెండు కేసులు నమోదయ్యాయయి. ఈ సంవత్సరం ఆగస్టు 25న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఆర్ ఆర్ పేట లో జువెలరీ షాప్ లోకి వెళ్లి వీరిద్దరూ కొన్ని నగలను పరిశీలించారు. కొద్దిరోజుల్లో శుభకార్యం ఉందని కొన్ని నగలు కావాలన్నారు. నగలను చూసుకున్న తర్వాత ఇంటి వద్ద కుటుంబ సభ్యులకు చూపించి ఎంపిక చేస్తామని దుకాణ యజమాని చెప్పి బంగారు నగలను పట్టుకుపోయి కనిపించకుండా పోయారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన కమ్ముల రవి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తానని కొంత సొమ్ము తీసుకున్నాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు టూ టౌన్ సిఐ ఆది ప్రసాద్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 55 గ్రాములు బంగారు ఆభరణాలు, ఒక లక్షా 60 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Conclusion:బైట్. దిలీప్ కుమార్ , ఏలూరు డిఎస్పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.